బ్రిటన్‌లో భారీగా కరోనా కేసులు.. అక్టోబర్ నెలలో 20లక్షల మందికి కరోనా
కరోనా వైరస్ ప్రపంచానికి పెను సవాలుగా మారింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడు కోలుకున్నట్లు కనిపిస్తున్నా.. కొత్త వేరియంట్లు జనాలను భయపెడుతున్నాయి.
తాజాగా బ్రిటన్‌లో భారీ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలో ఇప్పటివరకు 20లక్షల మందికి కరోనా పాజిటివ్ తేలినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ఇంగ్లాండ్‌లోనే ప్రతి 30 మందిలో ఒకరికి కోవిడ్ ఉన్నట్లు ద గార్డియన్ వెల్లడించింది. గడిచిన వారంలోనే 17 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు.
అక్టోబర్ 10తో ముగిసిన వారంలో 8,198 మంది ఆసుపత్రుల్లో చేరారు. కోవిడ్-19 ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఈ నెల చివరి నాటికి మరింత విజృంభించే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరించింది.