శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (12:14 IST)

కోవిడ్ -19తో విలవిల్లాడుతున్న అమెరికా.. భారత్‌లో కొత్త కేసులు

కోవిడ్-19 ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం కరోనాతో విలవిల్లాడుతోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ వల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 80 వేలు దాటింది. గత 24 గంటల్లో వైరస్ వల్ల 876 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గత కొన్ని రోజుల నుంచి ప్రతి రోజూ అమెరికాలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అమెరికాలో అత్యధిక స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13,66,962 మందికి వైరస్ సోకినట్లు తేలింది.  
 
ఇక భారతదేశంలో గత 24 గంటల్లో 4,213 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, దేశంలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 67,152కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.