సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (21:21 IST)

కరోనా లాక్ డౌన్ బెలారస్‍‌లో లేదు.. 2919 కేసులు.. 29మంది మృతి

ప్రపంచ దేశాలన్నీ కరోనా కోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో బెలారస్ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేశంలో కనీసం లాక్‌డౌన్‌ను కూడా పూర్తి అమలు చేయడం లేదు. అంతేగాక ఇక్కడ విచ్చలవిడిగా అన్నీ క్రీడలు కొనసాగుతూనే వున్నాయి. వీటిని వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ఇప్పటివరకు బెలారస్‌లో 2919 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బెలారస్‌లో ఆటలను బహిష్కరించాలనే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆదివారం బెలారసియన్ టాప్-ఫ్లైట్ లీగ్ మ్యాచ్‌కు దాదాపు వెయ్యి మంది అభిమానులు హాజరయ్యారు. ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ.. నినాదాలు చేశారు. 
 
ఈ ఆటకు చాలామంది దూరంగా ఉన్నప్పటికీ వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ముఖానికి మాస్కులు ధరించి కనిపించారు. కాగా కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ బెలారస్‌ అధికారులను కోరింది.