గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:12 IST)

ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 13,915.. యూఏఈలో ఎన్నారైలకు?

ఇటలీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,15,877కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి 53,218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటలీలో అత్యధికంగా 13,915 మంది మరణించగా, 1,15,242ల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. స్పెయిన్‌లో 10,348 మంది, అమెరికాలో 6,088 మంది ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు.
 
జర్మనీలో మృతుల సంఖ్య 1,107, ఫ్రాన్స్‌లో 5,387 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. అగ్రరాజ్యాలను సైతం ఈ వైరస్‌ గడగడలాడిస్తోంది. అటు గల్ఫ్ దేశాల్లోనూ తన ఉనికి చాటుకున్న ఈ మహమ్మారి అక్కడ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 
 
ఇక యూఏఈలో కొవిడ్‌-19 విజృంభణతో గురువారం ఒక్కరోజే 210 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1024కి చేరాయి. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు ఉన్నారని యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటున్నట్లు యూఏఈ తెలిపింది.