బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:05 IST)

బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాను ప్రభావం... 2.19 లక్షల మంది ఖాళీ

sitrang cyclone
బంగ్లాదేశ్ దేశంలో సిత్రాంగ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలకు చెందిన 2.19 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను ప్రభావం బంగ్లాదేశ్‌లోని తూర్పు ప్రాంతంలో అధికంగా కనిపిస్తుంది. ఈ తుఫాను ధాటికి ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
తుఫాను బాధితుల కోసం 6,925 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికి పైగా రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు. మరోవైపు తుఫాను తీరందాటే సమయంలో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఇది సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి తీర ప్రాంతంలోని 15 జిల్లాలకు చెందిన 2,19,990 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను తీరం దాటినపుడు అలలు ఎగిసిపడుతాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సాఖ హెచ్చరికలు జారీచేసింది. కాక్స్ బజారులోని 10 లక్షల మంది రొహింగ్యాలు ఉన్నారని పేర్కొన్న అధికారులు వారికి అత్యవసరమైన ఆహారం, మందులు, తాగునీరు, టార్పాలిన్లు అందజేస్తున్నట్టు తెలిపింది.