కుమార్తెను స్వెట్టర్ పట్టుకుని లాక్కెళ్లిన తండ్రి.. (వీడియో) వైరల్

Last Updated: బుధవారం, 9 జనవరి 2019 (12:12 IST)
విమానాశ్రయంలో కుమార్తెను ఓ తండ్రి లాక్కెళ్ళిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలోని వాషింగ్టన్ డ్యూల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూయర్ రోజున కుమార్తె హూడీని ఆమె ధరించిన స్వెట్టర్‌ను లగేజీని ఈడ్చుకెళ్లినట్లు ఓ తండ్రి తీసుకెళ్లాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తండ్రి తనను లాక్కెళ్తున్నా ఆ చిన్నారి అరవడం కానీ, భయపడడం కానీ చేయలేదు. చేతిలో లగేజీతో ఆమె సోదరి వారిని అనుసరిస్తోంది. వీడియో వైరల్ కావడంతో తండ్రి స్పందించాడు. కుమార్తె తన వెనక నడవడం ఇబ్బందిగా అనిపించిందని అందుకే అలా లాక్కెళ్లానని వివరణ ఇచ్చాడు. 
 
అయినా స్వెట్టర్ లాంటి ఆ క్లాత్ మెడకు తగిలితే పాపకు ఊపిరాడటం కష్టం కాలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కానీ మెడకు తగలకుండా స్వెట్టర్ పై భాగాన్ని చేతికి పట్టుకుని లగేజీలా లాక్కెళ్లడంతో.. పాప భయపడకుండా తండ్రిని అనుసరిస్తుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
 దీనిపై మరింత చదవండి :