శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (11:03 IST)

ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వాట్సాప్: భారత్‌లో ''ఐఎస్'' విస్తృతికి.. సిగ్నల్ యాప్!

సోషల్ మీడియా ఉగ్రవాదులకు మరింత ఊతమిస్తుందని అమెరికా హెచ్చరించింది. ఇంకా వాట్సప్ సరికొత్తగా ఎన్‌‌క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టగానే.. అది ఉగ్రవాదులను మరింత ఊతమిస్తుందని అమెరికా వెల్లడించింది. దీనిద్వారా సైబర్‌ నేరాలు పెచ్చురిల్లుతాయని తెలిపింది. కానీ వాటిని వాట్సప్‌ పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఇదే తరహా ఎన్‌‌క్రిప్షన్ సాంకేతికత గల యాప్‌ను భారతలో ఐఎస్‌ సానుభూతిపరులు వినియోగిస్తున్నారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది. 
 
వికీలీక్స్ పేరుతో రహస్యాలను బయటపెట్టి అగ్రరాజ్యాల అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్.. అమెరికా వదిలేసిన తర్వాత కూడా మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ఒక ఎన్‌క్రిప్షన్ చాటింగ్ యాప్‌ను ఉపయోగించేవారు. దీని ద్వారా ఏ సమాచారం పంపినా.. దానిని భద్రతా సంస్థలు పసిగట్టడం అసాధ్యం. ఆ యాప్‌ పేరే ‘సిగ్నల్‌’. ఇప్పుడు అదే తరహా యాప్‌ను తామూ ఉపయోగిస్తున్నామని అమెరికా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణలో ఐఎస్‌ తరఫున భారత్‌లో పనిచేస్తున్న ఉగ్రవాది అబూ అనాస్‌ వెల్లడించాడు. 
 
ప్రస్తుతం భారతలో ఐఎస్‌ విస్తృతిపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందులో సిరియాలోని ఐఎస్‌ ఉగ్రవాదులు.. భారత్ వంటి దేశాల్లోని తమ సంస్థ సభ్యులతో మాట్లాడేందుకు ‘సిగ్నల్‌’ యాప్‌ని ఉపయోగిస్తున్నారని గుర్తించింది. ‘వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇనస్టాగ్రాం లానే ఈ ‘సిగ్నల్‌’ యాప్‌ కూడా ఆన్‌‌లైన్‌‌లో ఓపెన్ సోర్సుగా అందుబాటులో ఉన్నట్లు అనాస్ చెప్పాడు.