శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2015 (16:21 IST)

చపాతీని గుడ్రంగా చేయలేదని కుమార్తెను హత్య చేసిన పాక్ వాసి!

తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు పిల్లలు చేసే చిన్నపాటి తప్పులకే తీవ్రంగా దండిస్తున్నారు. ఇలాంటి సంఘటన పాకిస్థాన్‌లో జరిగింది. చపాతీని గుడ్రంగా చేయలేదన్న కోపంతో ఓ తండ్రి తన కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. ఇస్లామాబాద్‌లోని అజీమ్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే..
 
అనీఖా(13) అనే అమ్మాయికి చపాతీలు చేయమని తండ్రి కోరాడు. అయితే ఆ అమ్మాయి చపాతీలు గుండ్రంగా చేయలేదు. అదే ఆమె చేసిన పాపం. చపాతీలు గుండ్రంగా చేయలేదని కుమారుడి సహకారంతో కూతురుని చితకబాదారు. దీంతో ఆ అమ్మాయి స్పృహ తప్పిపోయింది. 
 
ఆ వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. తమ కళ్ల ముందే కూతురి ప్రాణం పోయినా కరగని ఆ మృగాలు.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా రోడ్డు ప్రక్కన పొలాల్లో పడేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును నమోదు చేసి తండ్రీ కుమారుడిని అరెస్టు చేశారు.