శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (11:35 IST)

శ్రీనివాస్‌ను పొట్టనబెట్టుకున్న ప్యూరింటన్‌.. పిజ్జా పార్లర్‌లో పాత్రలు కడిగాడట..

ఉన్నత చదువులు, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన భారతీయుల్లో భయాందోళన అధికమయ్యేందుకు కన్సస్ కాల్పుల ఘటన ప్రధాన కారణమైంది. విదేశీయుల పట్ల అమెరికాలో కొంతమంది స్థానిక పౌరులకి ఎంత ఆగ్రహావేశాలు వున్నాయో, విద్వేషం

ఉన్నత చదువులు, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన భారతీయుల్లో భయాందోళన అధికమయ్యేందుకు కన్సస్ కాల్పుల ఘటన ప్రధాన కారణమైంది. విదేశీయుల పట్ల అమెరికాలో కొంతమంది స్థానిక పౌరులకి ఎంత ఆగ్రహావేశాలు వున్నాయో, విద్వేషం ఏ స్థాయిలో వుందో ఈ ఘటన నిరూపించింది. కాల్పులు జరిగిన కన్సస్ సిటీలో ఇండియన్ అమెరికన్స్ సంఖ్య అధికంగానే వుంది. 
 
ఈ నేపథ్యంలో కన్సస్ బారులో కాల్పులు జరిపిన ఉన్మాది ఓ పచ్చి తాగుబోతు అని స్థానికులు అంటున్నారు. అమెరికాలోని కేన్సస్‌లో కాల్పులు జరిపి శ్రీనివాస్‌ కూచిభొట్లను పొట్టనబెట్టుకున్న ఆడమ్‌ ప్యూరింటన్‌‌కు చెడు అలవాట్లు ఎక్కువని పొరిగింటి వారు చెప్తున్నారు. 18 నెలల క్రితం తండ్రి మరణించినప్పటి నుంచి తాగుడుకు బానిసైపోయాడని స్థానికులు అంటున్నారు. ప్యూరింటన్‌ తమతో తెగతెంపులు చేసుకున్నాడని అతడి తల్లి మార్షా ప్యూరింటన్‌ తెలిపారు.
 
నౌకాదళంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేసిన ప్యూరింటన్‌.. అక్కడి నుంచి బయటకు వచ్చాక అనేక ఉద్యోగాలు చేసినా ఎక్కడా స్థిరపడలేదు. ఈ క్రమంలో ఓ పిజా పార్లర్‌లో పాత్రలు కూడా కడిగాడు. కొన్నిసార్లు ఉదయాన్నే పీకలదాకా తాగేవాడని తెలిపారు. శారీరకంగా, మానసికంగా అతడి పరిస్థితి క్షీణించిందని వివరించారు. పక్షులను వేటాడేందుకు షాట్‌గన్స్‌ను ఉపయోగించేవాడని తెలిపారు. వాటిని తండ్రి నుంచి పొందాడని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సంబంధించిన రిపబ్లికన్‌ పార్టీలో అతడు నమోదయ్యాడని స్థానికులు అంటున్నారు.