1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (17:39 IST)

యువతి బట్టలు చించేసిన ముగ్గురికి మరణశిక్ష.. ఎక్కడ?

మనదేశంలో మహిళలపై అత్యాచారాలు జరిగినా హత్యలు జరిగినా.. కఠినమైన చట్టాలు లేకపోవడంతో దురాగతాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆఫ్రికా దేశంలో ఓ యువతి దుస్తులను చించేసి.. ఆమెను అవమానించిన పాపానిక

మనదేశంలో మహిళలపై అత్యాచారాలు జరిగినా హత్యలు జరిగినా.. కఠినమైన చట్టాలు లేకపోవడంతో దురాగతాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆఫ్రికా దేశంలో ఓ యువతి దుస్తులను చించేసి.. ఆమెను అవమానించిన పాపానికి ముగ్గురు యువకులక కెన్యా కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 
 
ఆఫ్రికా దేశంలోని కెన్యాలో గత 2014వ సంవత్సరం.. బస్సులో ఓ యువతి ప్రయాణిస్తుండగా, అదే బస్సులో ప్రయాణించిన ముగ్గురు యువకులు అభ్యంతరకర రీతిలో ప్రవర్తించారు. ఇలా గ్లామర్‌గా దుస్తులు ధరిస్తే నిన్ను చూసే పురుషులకు అత్యాచారం చేయాలనే ఆలోచనే వస్తుందని.. అభ్యంతరకర రీతిలో దూషించారు. 
 
ఇంకా ఆమె దుస్తులను చించేశారు. దీంతో అవమానానికి గురైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. యువకులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశాయి. ఈ కేసుపై మూడేళ్ల పాటు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కెన్యా కోర్టు ముగ్గురు యువకులకు మరణ శిక్ష విధించింది. యువతిని బట్టలు చించి అవమానించిన నేరానికి కెన్యాలో మరణ శిక్ష పడటం ఇదే తొలిసారి. 
 
1987 నుంచి మరణశిక్షలు విధించబడట్లేదు. అంతకుముందు విధించిన మరణశిక్షల్ని కూడా జీవితఖైదుగా మార్చేస్తూ.. కెన్యా అధ్యక్షుడు ఉక్రూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తాజాగా యువతిని అవమానించిన నేరానికి కెన్యా కోర్టు మరణశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పునిచ్చింది.