బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 26 జూన్ 2024 (23:16 IST)

సింగపూర్ నుంచి 'డిస్నీ క్రూయిజ్ లైన్' నౌకలో సముద్రయానం-2025లో ప్రారంభం

Sailing from Singapore
సముద్రయానం చేయాలని అనుకునే వారికి ఇది శుభవార్తే. ఫ్యామిలీ అంతా ప్రయాణించడానికి వీలుగా డిస్నీ అడ్వెంచర్ వినోదకరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. 2025లో సింగపూర్ నుంచి ఇది బయలదేరనుంది. ఈ డిస్నీ క్రూయిజ్ లైన్ నౌక ఆసియాలోని పోర్ట్ ల్యాండ్ నుంచి బయలుదేరుతుంది. ఈ సముద్రయానం మూడున్నర రాత్రులు ఉంటుంది. ఈ నౌకా ప్రయాణంలో ఉద్విగ్న భరితమైన ఆనందం వినోదం లభించును.
 
మునుపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారి ఈ డిస్నీ షిప్ ను ఆసియాలో ప్రవేశ పెడుతున్నామని డిస్నీ అడ్వెంచర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ షారోన్ సిస్కీ తెలిపారు. మా అతిథులకు ఎక్కువ సంతోషం, ఆనందం అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. డిస్నీ అడ్వెంచర్ నౌకలో ప్రయాణం చేసేటప్పుడు అతిథులు మునుపెన్నడూ లేని విధంగా డిస్నీ ఫిక్సర్, మార్వెల్ వంటి ప్రపంచాలకు అతిథులు వెళ్లి ఊహా లోకంలో విహరిస్తారని తెలిపారు. ఏదో తెలియని సంతోషానికి, అనుభూతికి గురవుతారన్నారు. మధుర జ్ఞాపకాలను తమ మనసులో ఎల్లప్పుడూ పదిలంగా దాచుకుంటారని తెలిపారు.
 
డిస్నీ అడ్వెంచర్ ప్రయాణంలో కనిపించే కొత్త ప్రదేశాలు
డిస్నీ అడ్వెంచర్ ఒక ప్రయాణమే కాక ఒక గమ్యస్థానం కూడా. మనకు ఈ సముద్ర యానం అవధులు లేని అనుభవాల్ని ఇస్తుంది. ఈ ప్రయాణంలో అతిథులు ఊహా లోకంలో విహరిస్తూ ఫాంటసీ, సాహసకృత్యాలు వంటి అనుభవాలను పొందుతారు. ఈ ఆనందకరమైన ప్రయాణంలో ప్రయాణికులు ఏడు రకాలైన ఆనందకరమైన, మర్చిపోలేని అనుభవాలను పొందుతారు. ఈ ప్రయాణం మన ఊహలకు ద్వారాలు తెరిచే ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. స్వాప్నికులు తమదైన కలలను కంటారు. ప్రయాణికులు ఊహల పల్లకిలో ఊహల తోటలో విహరిస్తున్నట్లు అనుభూతి చెందుతారు.
 
డిస్నీ ఊహ తోటలో హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అతి మనోహరమైన తోటలు, ఓపెన్ ఎయిర్‌లో వివిధ రకాలైన వినోదకరమైన కార్యక్రమాలను మనం చూడవచ్చు. ఇవన్నీ ఒకే చోట లభిస్తాయి. వంద సంవత్సరాల వీరోచిత పాత్రలు మనకు దర్శనమిస్తాయి. మోయనా నుంచి అడవిలో మొగ్లీ వరకు సాహసాలు మనకు కనిపిస్తాయి. అతిథులను ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకొని వెళతాయి.
 
డిస్కవరీ రీఫ్ వద్ద కుటుంబ సభ్యులందరూ ఆటలు ఆడుకోవడం, షాపింగ్ చేయడం, కలిసి భోజనం చేసే వసతులు ఉంటాయి. దీనిలో డిస్నీ యానిమేషన్ స్టూడియో, ఫిక్సర్ యానిమేషన్ స్టూడియో కలవు. సముద్రయాన గాధలను ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ది లిటిల్ మెర్మైడ్, వారిలో స్టిచ్, ఫైండింగ్ నెమో, లూకా స్టూడియోలు అందుబాటులో ఉంటాయి. వరల్డ్ డిస్నీ యానిమేషన్ ప్రపంచంలో మనం బిగ్ హీరో సిక్స్, శాన్ ఫ్రాన్సిస్కో వీధులు మనకు గొప్ప ఆనందాన్ని కలగజేస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం మనకు లభిస్తుంది. వీధి మార్కెట్లు, గేమ్స్ ఇతర కార్యక్రమాలు షాపులు, సినిమాలు ఇంకా మరెన్నో మనకు దర్శనమిస్తాయి.
 
వే ఫైండర్ బే వద్ద-సముద్రం, ఆకాశం కలిసే ప్రాంతం మనం చూడగలం. సూర్యుని కింద ఉండే ఒయాసిసులను మనకు దర్శనమిస్తాయి. అక్కడ మనం సేద దీరగలం. పసిఫిక్ దీవులను మనం చూడగలం. డిస్నీ యానిమేషన్స్ మోయోనా మనకు అద్భుతమైన సముద్ర తీరా దృశ్యాలను కనువిందు చేస్తుంది. మ్యాజిక్ ఆఫ్ ఫాంటసీ నందు మనకు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. అనేక కథలను మనం వినవచ్చును.
 
టౌన్ స్క్వేర్ నందు తమ కలలను సాకారం చేసుకునే అవకాశం లభించును. మన కలలు నిజమవుతాయి. ఈ ఊహ జనితమైన అటవీ ప్రాంతంలో మనం షాపులు, లాంజెస్, కేఫ్ , రెస్టారెంట్లు, వినోద స్థలాలను చూడవచ్చు. వేసవి కాల అనుభవాన్ని పొందవచ్చు. టేంగల్డ, సిండ్రెల్లా, ఫ్రోజెన్, స్నో వైట్, సెవెన్ డ్వార్ట్, ది ప్రిన్సైస్ అండ్ ది ఫ్రాగ్ వంటి ఎన్నో ఈవెంట్లు మనకు లభిస్తాయి. ప్రతి డిస్నీ అడ్వెంచర్ లో మనం ఆనందకరమైన ఉల్లాసకరమైన అనుభూతులను పొందుతాం.
 
మార్వెల్ లాండింగ్ వద్ద అన్ని వయసుల వారికి తమ అభిమాన హీరోలు తారసపడతారు. ఆకర్షణీయమైన ప్రదేశాలు మనం చూడగలం. ఒక కొత్త అనుభూతిని మనం పొందగలం. టోయ్ స్టోరీస్ వద్ద ప్రయాణికులు ఆనందకరమైన అనుభవాన్ని పొందుతారు. వివిధ రకాలైన ఆటలు ఆడుకునే ప్రదేశాలు ఉంటాయి. వివిధ రకాలైన ఫుడ్ ప్రదేశాలు ఉంటాయి. నీటితో ఆడుకునే ఆటలు ఉంటాయి. చిన్న పిల్లలకు సినిమాలు ప్రదర్శన ఉంటుంది. మ్యాజిక్ మీట్స్ బిజీ వద్ద అతిథులు తమ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ప్రతి ఒక్కరు విశ్రాంతి పొందడానికి అనువైన ప్రదేశం ఎప్పుడు ఊహించని వినోదం లభిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆహార సరఫరా చేసే హోటల్స్ ఉంటాయి.
 
ఈ సముద్రయాన ప్రయాణంలో మనకి పరిమితం లేని ఇండోర్, అవుట్డోర్ ప్రదేశంలో ఆనందం, మానసిక ఉల్లాసం లభించును. ప్రత్యేక వినోదం, కుటుంబ సభ్యులందరూ కలసి ఆనందించే విధంగా ఉంటుంది. పెద్దలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా నౌకా సిబ్బంది పిల్లలను  చూసుకుంటారు. వారికి వినోదాన్ని అందిస్తారు. అతిథుల పట్ల చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. ఈ సందర్భంగా రీజనల్ జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ శర మాట్లాడుతూ డిస్నీ అడ్వెంచర్ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అధిగమించామన్నారు. ఇది ఆసియా ఖండానికి కొత్తగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. అతిథులు సముద్రంలో ఒక కొత్త అనుభూతులను పొందుతారని పేర్కొన్నారు. ఈ డిస్నీ హూ ఇస్ వెకేషన్ నందు ప్రపంచ ఖ్యాతి పొందిన వినోదం, ఆనందం ఇచ్చునన్నారు. అతిథులు మర్చిపోలేని ఆహ్లాదకరమైన సంతోషాన్ని అనుభవిస్తారని తెలిపారు. అనేక ఆటలు, వినోదం లభించునన్నారు. ఈ నౌకాయానం నందు అతిథులు అంతర్జాతీయ ప్రామాణిక మైన ఆహారాన్ని పొందుతారన్నారు. అత్యాధునికమైన రెస్టారెంట్లలో భోజనం చేసే అవకాశం ఉంటుందన్నారు. అంకితభావం కలిగిన సిబ్బంది తమ సేవలను అతిథులకు అందిస్తారన్నారు. ఏ సమస్య రాకుండా ఎల్లవేళలా చూస్తూ ఉంటారన్నారు. సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీల్ కావచ్చన్నారు.
 
విశ్రాంతి తీసుకునే సమయంలో అతిథులు తమ గదులలో విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండే విధంగా గదులు ఏర్పాటు చేయడమైనదన్నారు. విడివిడిగా స్నానాలకు గదుల ఏర్పాటు ఉందన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకేసారి రెడీ అవ్వడానికి ఏర్పాటు కలదన్నారు. విలాసవంతమైన వసతులు ఉంటాయన్నారు. ఆరోగ్యకరమైన పరిసరాలు సేవలు లభిస్తాయన్నారు. ఇండోర్ లాంజ్, అవుట్డోర్ లాంజ్, షాపింగ్ చేసేందుకు అనువైన ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఫిట్నెస్ పెంచుకోవడానికి జిమ్, స్పా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.   
 
ఆ కొత్త సాహసానికి తెరలేచింది
2025 లో ప్రారంభం కానున్న డిస్నీ అడ్వెంచర్ కార్యక్రమం మూడు లేదా నాలుగు రాత్రులు  ఉంటుంది. ఐదు సంవత్సరాల కాలానికి మెరీనా బే కోయిస్ కేంద్రం నుంచి డిస్నీ క్రూజ్ లైన్, సింగపూర్ టూరిజం బోర్డు అనుసంధానంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ సౌకర్యం కలదు. సౌత్ ఈస్ట్ ఏసియాలో సింగపూర్ ఫోర్ట్ ప్రసిద్ధి చెందినది. 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఒకటిగా ఉంది. 208,000 టన్నుల సామర్థ్యం కలిగిన డిస్నీ క్రూయిజ్ లైన్ సుమారు 2500 సిబ్బందితో 6700 ప్రయాణికులు రాగలరని అంచనా వేయడం జరిగింది.