శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (12:20 IST)

అమెరికాకు చెడు పరిణామాలు సంభవించనున్నాయ్ : డోనాల్డ్ ట్రంప్ జోస్యం

అమెరికాకు చెడు పరిణామాలు సంభవించనున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. తాను తీసుకొచ్చిన కొత్త హెల్త్ కేర్ బిల్లుకు ఆ దేశ ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఈ బిల్లు పాస్ కాలే

అమెరికాకు చెడు పరిణామాలు సంభవించనున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. తాను తీసుకొచ్చిన కొత్త హెల్త్ కేర్ బిల్లుకు ఆ దేశ ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఈ బిల్లు పాస్ కాలేదు. ఈ విషయం తెలుసుకున్న అమెరికా ప్రజలు చికాగోలోని ట్రంప్ టవర్ వద్ద సంబరాలు చేసుకున్నారు.
 
దీనిపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపక్షంలోని డెమోక్రాట్లు కూడా ఓ మంచి బిల్లును గుర్తించడం లేదని అరోపించారు. ఈ చర్య వల్ల  ఒబామా కేర్‌ కొనసాగనుందని, ఒక్కసారిగా ఇన్సూరెన్స్‌ ప్రీమియం రేట్లు పెరగనున్నాయని అన్నారు. ప్రస్తుతం తాను చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించిన ఆయన, దేశానికి చెడు పరిణామాలు సంభవించనున్నాయని హెచ్చరించారు.
 
గత 18 నెలలుగా ఒబామా కేర్‌‌ను తాను వ్యతిరేకిస్తూనే ఉన్నానని గుర్తు చేసిన ఆయన, ఈ పథకం కొనసాగితే పరిస్థితి దిగజారుతుందని అన్నారు. పాలసీ ప్రీమియంలు భారీగా పెరిగి, ప్రజలు ఈ బీమాను ఉపయోగించుకోలేని దుస్థితి రానుందని ఆయన వ్యాఖ్యానించారు.