శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (14:23 IST)

ప్లీజ్ మా మామగారికి ఓటేయండి.. తెరపైకి డోనాల్డ్ ట్రంప్ కోడలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రచార హీట్ కూడా పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు హిల్లరీ క్లింటన్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్... ఇండియన

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రచార హీట్ కూడా పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు హిల్లరీ క్లింటన్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్... ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం తన కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు.
 
వర్జీనియాలోని లాడన్ కౌంటీలో రాజధాని హిందూ దేవాలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ కోడలు లారా పాల్గొన్నారు. పనిలో పనిగా తన మామగారికి ఓటు వేయాలని ప్రవాస భారతీయులను అభ్యర్థించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్ - అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని అన్నారు. భారతదేశం అన్నా, భారతీయులన్నా తన మామగారికి ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. భారతీయ సంస్కృతిని తాను ఎంతోగానే గౌరవిస్తానని పేర్కొంటూ చెప్పులు బయట విడిచిపెట్టి ఆమె ఆలయంలోకి ప్రవేశించారు.