బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (12:19 IST)

భారత్ అభివృద్ధి చెందుతుంటే ఎందుకివ్వాలి? డోనాల్డ్ ట్రంప్

భారత్ అభివృద్ధి చెందుతుంటే ఆ దేశానికి రాయితీలు ఎందుకివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. శుక్రవారం ఉత్తర డకోటా రాష్ట్రంలోని ఫార్గో నగరంలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన ప్

భారత్ అభివృద్ధి చెందుతుంటే ఆ దేశానికి రాయితీలు ఎందుకివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. శుక్రవారం ఉత్తర డకోటా రాష్ట్రంలోని ఫార్గో నగరంలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అమెరికా ఇతర దేశాలకు అనవసరంగా ఆర్థిక సహాయం చేస్తోందని, దాన్ని కొనసాగించకూడదని చెప్పారు.
 
కొన్ని దేశాలను మనం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని అంటున్నాం. కొన్ని దేశాలు ఇంకా పరిణితి చెందలేదు కాబట్టి మనం వాటికి రాయితీలు ఇస్తున్నామని చెబుతున్నాం. ఇదంతా వెర్రితనం. భారత్‌, చైనా, ఇంకా ఇతర దేశాలు నిజంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆ దేశాలు వాటికవే అభివృద్ధి చెందుతున్న దేశాలమని చెప్పుకుని ఆ వర్గీకరణ కింద రాయితీలు పొందుతాయన్నారు. 
 
అంతేకాకుండా, అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే అని చెప్పారు. తాము ఇంకా అభివృద్ధి చెందినదేశం కాలేదని సెలవిచ్చారు. భారత్, చైనాలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, వీటిని నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అనవసరంగా విదేశాలకు చేస్తున్న సాయాన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందన్నారు.