బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (10:55 IST)

ఇండోనేషియాలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు ప్రావిన్స్ అయిన పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున 12.46 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని చెప్పింది.
 
ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.తరచూ భూకంపాలు సంభవించే ఇండోనేషియాలో గురువారం సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు.