గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (00:41 IST)

గుండ్రంగా వున్న కోడిగుడ్డు.. 10 లక్షల్లో ఒక్క గుడ్డు.. రేటెంతో తెలుసా?

EGG
ఆస్ట్రేలియాకు చెందిన జాక్వెలిన్ బెల్గేట్ గుండ్రంగా వున్న గుడ్డును చూపుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అక్కడి వూల్‌వర్త్ ప్రాంతంలోని ఓ కిరాణా దుకాణంలో సదరు మహిళ షాపింగ్‌కు వెళ్లింది. అప్పుడు ఆమె అక్కడ ఒక గోళాకార గుడ్డు కనిపించింది. 
 
ఎప్పుడూ ఓవల్ షేప్‌లో వుండే కోడిగుడ్డు.. ఒక్కసారిగా గుండ్రంగా వుండటం చూసి వెంటనే కొనుగోలు చేసింది. ఈ ఆకారంలో ఇంకేమైనా గుడ్లు ఉన్నాయా అని గూగుల్‌లో వెతికింది. అప్పుడు 10 లక్షల్లో ఒక్క గుడ్డు మాత్రమే ఈ రూపంలో వుంటుందని తేలింది.
 
చివరకు ఇలా దొరికిన గుడ్డును భారత విలువ ప్రకారం రూ.1.14 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న గుండ్రంగా వున్న గుడ్డు గల వీడియో ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వీక్షణలను సేకరించింది.