శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:21 IST)

ఈజిప్టు మాజీ అధినేత మోర్సీకి 20 యేళ్ళ జైలు.. ఎందుకు?

ఈజిప్ట్ మాజీ దేశాధ్యక్షుడు మహమ్మద్ మోర్సీకి 20 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ, ఆ దేశ న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. 2012లో స్వదేశంలో నిరసనలు చెలరేగాయి. ఆ సమయంలో నిరసనకారులను ఊచకోత కోయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ హత్యా కేసుల్లో ఆయన్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ఈ శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. 
 
ఆయనపై పలు కేసులు విచారణలో ఉండగా, శిక్షపడ్డ మొదటి కేసు ఇది. డిసెంబర్ 2012లో అధ్యక్ష భవనం ముందు నిరసన తెలుపుతున్న ప్రజలపై ఆయన ప్రోద్భలంతో కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై హత్యారోపణలను తోసిపుచ్చిన కోర్టు 'బలాన్ని ఉపయోగించారు' అని పేర్కొంటూ, ఈ శిక్షను విధించారు. ఆయనతో పాటు మరో 12 మంది బ్రదర్ హుడ్ పార్టీ నేతలకూ ఇదే శిక్ష విధిస్తున్నట్టు జడ్జి తీర్పు చెప్పారు.