శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (13:56 IST)

యూకేలో రోడ్డు ప్రమాదం.. ఇండియన్ టెక్కీలు దుర్మరణం.. విప్రోలో విషాదం

బ్రిటన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ టెక్కీలు దుర్మరణం చెందారు. వీరంతా టెక్ దిగ్గజం విప్రోలో పని చేస్తున్నారు. దీంతో విప్రోలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 8

బ్రిటన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ టెక్కీలు దుర్మరణం చెందారు. వీరంతా టెక్ దిగ్గజం విప్రోలో పని చేస్తున్నారు. దీంతో విప్రోలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 8 మంది చనిపోయారు. మృతులంతా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వారు. ముఖ్యంగా బ్రిటన్‌లో గత 24 యేళ్ళలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదే కావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
విప్రో కంపెనీకి చెందిన కొందరు ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓ మినీబస్‌లో వెళుతున్నారు. ఈ మినీ బస్ అదుపు తప్పి రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం బకింగ్‌హామ్‌షైర్‌లోని న్యూపోర్ట్ పాగ్నెల్‌లో వద్ద జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు విప్రో ఉద్యోగులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ కూడా భారతీయుడే. మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇద్దరు లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు పెట్టిన పోలీసులు నేడు (సోమవారం) కోర్టులో హాజరు పరచనున్నారు. నవంబరు, 1993 తర్వాత బ్రిటిష్ మోటార్ వేపై జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ఆ ప్రమాదంలో 12 మంది చిన్నారులు, వారి టీచర్ ప్రాణాలు కోల్పోయారు.