మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:51 IST)

ఎలెన్ మస్క్ ప్రేమాయణం.. వేలానికి ఫోటోలు

elon musk
స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రేమాయణంకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో పెన్సిల్వేనియా కాలేజీలో చదివిన సమయంలో జెన్నిఫర్ గ్వైన్‌తో ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత వారిద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత అతడిని గ్వైన్ ఒక్కసారి మాత్రమే కలిసిందట. ఇప్పుడు ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అప్పట్లో ఎలాన్ మస్క్‌తో డేటింగ్ సందర్భంగా మధుర జ్ఞాపకాల్లా నిలిచిన చిత్రాలను వేలం వేస్తోంది. తన సవతి కుమారుడి స్కూలు ఫీజులు చెల్లించేందుకు తనకు ఇంతకంటే మార్గం లేదని గ్వైన్ చెబుతోంది. ఈ వేలం పాటకు సంబంధించిన ఫోటోల్లో ఎలన్ మాస్క్‌తో ఆమె తీసుకున్న చాలా స్టిల్స్ వున్నాయి.  
 
ఈ ఫోటోల్లో ఎలాన్ మస్క్ సంతకంతో కూడిన డాలర్ నోటును కూడా గ్వైన్ వేలానికి ఉంచింది. ప్రస్తుతానికి ఈ డాలర్ నోటుకు 7,604 డాలర్ల వద్ద బిడ్డింగ్ నడుస్తోంది.