శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (10:43 IST)

జులై 12 నుంచి జపాన్‌లో ఎమర్జెన్సీ

జులై 12 నుంచి  జపాన్‌లో మళ్లీ ఎమర్జెన్సీని విధించారు. కరోనా నేపథ్యంలో.. ఇప్పటికే మూడుసార్లు ఆ దేశంలో ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే. మూడో ఎమర్జెన్సీ జులై 11 తో ముగియనుండగా, జులై 12 నుంచి 22 వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

దేశ రాజధాని టోక్యోతో సహా ప్రధాన నరగాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. మిగతా వేరియంట్ల కంటే డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుండటంతోపాటు, తీవ్రత కూడా అధికంగా ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు జపాన్‌ ప్రధాని పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో రోడ్లపైకి ప్రజలు గుంపులుగా వచ్చేందుకు అవకాశం ఉండదు. పార్టీలకు, సమావేశాలకు అనుమతులు ఉండవు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండాలి. అనవసరంగా రోడ్లమీదకు వస్తే కేసులు నమోదుచేసి జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. ఒలింపిక్స్‌కు 50 శాతం మంది ప్రజలకు మాత్రమే అనుమతి ఇస్తామని మొదట చెప్పినా, ప్రస్తుత పరిస్థితుల దఅష్ట్యా, ప్రేక్షకులు లేకుండానే విశ్వక్రీడలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.