ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జులై 2020 (09:46 IST)

ఉత్తర కొరియాలో ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

ఉత్తర కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో సరిహద్దు పట్టణమైన కెేసాంగ్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తొలి కేసు రాగానే కేసాంగ్‌ సిటీని పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు.

ఇతర జిల్లాలను, ప్రాంతాలను అప్రమత్తం చేశారు. కేసాంగ్‌లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితి దృష్ట్యా మహమ్మారి వ్యతిరేక ఎమర్జెన్సీ నుంచి గరిష్ట ఎమర్జెన్సీకి మారాలని, ఉన్నత స్థాయి హెచ్చరికను జారీ చేయాలని నిర్ణయించారు.

ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ (కెసిఎన్‌ఎ) తెలిపిన వివరాలను బట్టి కరోనా వైరస్‌ సోకినట్టుగా అనుమానం ఉన్న వారికి, గత అయిదు రోజులుగా కేసాంగ్‌ సిటీ వెళ్లినవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచుతారు.

ఆదివారం నాడు దక్షిణ కొరియా నుంచి అక్రమంగా సరిహద్దు గుండా ఉత్తరకొరియాలోని కేసాంగ్‌ సిటీకి వచ్చిన అనుమానిత కేసును ప్రాథమిక దశగా గుర్తించి, వెంటనే క్వారంటైన్‌కు పంపినట్టు కెఎన్‌సిఎ తెలిపింది.