ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (11:19 IST)

ఇంగ్లండ్‌లో మండిపోతున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన

temperature
ఇంగ్లండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయింది. ఈ ఎండల వల్ల ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని, అందువల్ల అత్యవసర పనులు సైతం వాయిదా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీని కూడా విధించింది. అంటే దేశంలో తొలిసారి ఎండల కారణంగా రెడ్ వార్నింగ్ జారీచేసింది. లండన్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని వారాల పాటు భానుడి ప్రతాపం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. 
 
పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలో దాటుతున్నాయని, ఇది ప్రమాద సంకేతమని బ్రిటన్ వాతావరణ విభాగం తెలిపింది. ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోజ్యానికి ప్రమాదమని పేర్కొంటూ అత్యిక స్థితి (ఎమెర్జెన్సీ)ని ప్రకటించింది. పైగా, ప్రజలు ఎండలకు వీలైనంత దూరంగా ఉండాలని కోరింది. 
 
పగటి పూట వీలైనంత మేరకు బయటకు రాకూండా ఉండాలని, అత్యవసర పనులు సైతం వాయిదా వేసుకోవాలని కోరింది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో నమోదవతున్న పగటి ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ ఫోన్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది.