శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 మే 2017 (13:30 IST)

ఐసిస్ ఉగ్రవాదిని పెళ్లాడిన ఎఫ్‌బిఐ అధికారిణి... పట్టుకోమని పంపిస్తే మనువాడింది...

అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ). ఈ సంస్థలో పని చేసే ఓ అధికారిణి ఏకంగా అమెరికాను వణికిస్తున్న ఐసిస్ సంస్థకు చెందిన ఓ కరుడుగట్టిన తీవ్రవాదిని వివాహం చేసుకుంది.

అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ). ఈ సంస్థలో పని చేసే ఓ అధికారిణి ఏకంగా అమెరికాను వణికిస్తున్న ఐసిస్ సంస్థకు చెందిన ఓ కరుడుగట్టిన తీవ్రవాదిని వివాహం చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
డానియెలా గ్రీన్ అనే 38 యేళ్ళ మహిళ ఎఫ్.బి.ఐలో పని చేస్తోంది. ఈమెను టెర్రరిస్టులను పట్టుకొనేందుకు నిఘా అధికారిగా నియమించారు. అయితే ఆమె టెర్రరిస్టులను పట్టుకొనే పనిని వదిలేసింది. టెర్రరిస్టుతోనే ఏకంగా ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకొంది.
 
అత్యంత రహస్య భద్రత కలిగిన ఈ మహిళ.. తన జర్మనీలో ఉన్న తన తల్లిదండ్రులను కలిసేందుకు వెళుతున్నానని చెప్పింది. కానీ, ఆమె అక్కడకు వెళ్లకుండా టర్కీ సరిహద్దుల మీదుగా సిరియాకు వెళ్ళి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని కలిసి, వివాహం చేసుకుంది. అయితే అతడు ఎవరనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
 
జర్మనీలో జన్మించిన డెనిస్ కస్పెర్ట్ అనే ఉగ్రవాదిని ఆమె వివాహం చేసుకొన్నట్టుగా స్థానిక మీడియా ప్రసారం చేసింది. 2015లో డెనిస్‌ను ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది. జర్మనీకి చెందిన ఐసిస్ ఉగ్రవాద గ్రూపుపై నిఘా నిర్వహించేందుకుగాను ఎఫ్.బి.ఐలో అనువాద విభాగంలో డానియెలాను నియమించారు. 2011లో అమెరికన్‌ను వివాహం చేసుకొన్న ఆమె అనూహ్యంగా 2014లో మాయమై డెనిస్‌ను పెళ్లిచేసుకుంది.