సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (14:06 IST)

కార్గో విమానం బోను నుంచి తప్పించుకున్న గుర్రం - హడలిపోయిన సిబ్బంది

న్యూయార్క్ నుంచి బెల్జియంకు బయలుదేరిన కార్గో విమానం బోను నుంచి గుర్రం ఒకటి తప్పించుకుంది. ఈ విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది హడలిపోయారు. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి.. తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. విమానం బరువు ఎక్కువగా ఉండటంతో 20 టన్నుల ఇంధన సముద్రంపాలు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
న్యూయార్క్ నుంచి బెల్జియంకు కార్గో విమానంలో తరలిస్తున్న ఓ గుర్రం.. కార్గో విమానంలోని బోను నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత ఈ గుర్రం విమానంలో అటూఇటూ తరగడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్ విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బెల్జియంకు ఇటీవల బోయింగ్ 747 కార్గో విమానం బయలుదేరింది. అందులో గుర్రాన్ని తరలిస్తుండగా విమానం బయలుదేరిన అర్థ గంట తర్వాత బోను నుంచి తప్పించున్న గుర్రం బయటకు వచ్చి అటూ ఇటూ తిరగసాగింది. దీన్ని చూసిన విమాన సిబ్బంది హడలిపోయారు. 
 
గుర్రం ఒక్కసారిగా బోను నుంచి దూకడంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. విమానాన్ని వెనక్కి మళ్లించి తిరిగి న్యూయార్క్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశఆరు. కాగా, విమానం వెనక్కి వస్తున్న సమయంలో బరువు ఎక్కువగా ఉన్న కారణంగా 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటింగ్ మహా సముద్రంల పారబోసినట్టు విమాన సిబ్బంది తెలిపారు.