అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇకలేరు...
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్.డబ్ల్యూ బుష్ ఇకలేరు. ఆయన వయసు 94 యేళ్లు. ఆయన భారత కాలమానం ప్రకారం శనివారం కన్నుమూశారు. ఈయన అమెరికాకు 41వ అధ్యక్షుడుగా 1989 నుంచి 93 మధ్యకాలంలో ఉన్నారు. ఈయన పూర్తిపేరు జార్జి హెర్బెర్ట్ వాకర్ బుష్.
రెండోసారి అధ్యక్షుడిగా కావాలనుకున్న ఆయన కల నెరవేరకపోయినా ఆయన కుమారుడు 43వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికకావడం విశేషం. తన అధ్యక్ష పదవీ కాలంలో యుధ్దాలకు చరమగీతం పలికి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చి ఇరాకీ బలగాలను కువైట్ నుంచి తరిమేందుకు కృషి చేశారు.
తన తండ్రి మరణించినట్టుగా ఆయన కుమారుడు బుష్ - 43 ప్రకటించాడు. అతని భార్య బార్బరా (73) మరిణించిన కొన్ని నెలలకే బుష్ కూడా మరణించడం యాదృచ్ఛికం. బుష్ తండ్రి ప్రెస్కాట్ బుష్ సెనేటర్‌గా సేవలు అందించాడు. ఈయన కొడుకు జెబ్ బుష్ రెండు సార్లు ఫ్లోరిడా గవర్నర్‌గా పనిచేయగా మరో కొడుకు జార్జి డబ్ల్యూ బుష్ రెండుసార్లు టెక్సాస్ గవర్నర్‌గా పనిచేసి రెండుసార్లు అమెరికా అధ్యక్షులుగా సేవలు అందించారు.