శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (09:14 IST)

కన్నీరు పెట్టిన జర్మనీ... అశ్రునయనాలతో నివాళి... ఎందుకో తెలుసా?

జర్మనీ కన్నీరుపెడుతోంది. ఓ తల్లి చేసిన ఘోరానికి ఆ దేశ ప్రజలంతా బోరున విలపిస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురిని ఆ తల్లి అత్యంత పాశవికంగా చంపేసింది. ఈ ముక్కుపచ్చలారని చిన్నారుల హత్య విషయం తెలుసుకుని జర్మనీవాసులు కన్నీరుపెడుతున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జర్మనీలోని సోలింగెన్‌ నగరంలో 27 యేళ్ళ మహిళకు మెలీనా, లియోనీ, సోఫీ, టిమో, లుకా అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరి వయసు 1 నుంచి 8 యేళ్ళ వరకు ఉంటాయి. ఈ ఐదుగురు బిడ్డలను గురువారం దారుణంగా హత్యచేసింది. ఆ తర్వాత తాను కూడా రైలు కింద దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఆమె తృటిలో ప్రాణాలు తీసుకుంది. 
 
కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయం తెలుసుకున్న స్థానికులతోపాటు దేశప్రజలంతా చలించిపోయారు. ఘటనా స్థలంలో శనివారం కొవ్వొత్తులు వెలిగించి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. 
 
ఈ చిన్నారులను హత్యచేయటానికి ముందు మహిళ తన 11 ఏండ్ల పెద్ద కుమారుడిని అమ్మమ్మ ఇంటికి పంపటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ హత్యలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గాయాలతో బయటపడిన సదరు మహిళకు దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.