టీనేజర్‌పై పోలీసుల అత్యాచారం: పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని?

మంగళవారం, 31 అక్టోబరు 2017 (16:35 IST)

ఓ టీనేజర్‌పై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ చేతికి బేడీలు వేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు కోర్టుకెక్కింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం ఆ టీనేజరే స్వయంగా శృంగారంలో పాల్గొనాలని చెప్పిందని.. పరస్పర అంగీకారంతోనే తాము శృంగారంలో పాల్గొన్నామని చెప్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. బ్రూక్లిన్‌కు చెందిన టీనేజర్ అన్నా చాంబర్స్ తాను గంజాయి తాగుతుండగా పార్కింగ్ ప్లేసులో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. ఆపై ఇద్దరు పోలీసులు తనపై వ్యానులోనే చేతికి బేడీలేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తోంది. సెప్టెంబర్ 15న ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
 
అయితే ఆ ఇద్దరు పోలీసులు మాత్రం అన్నా అంగీకారంతోనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నామని చెప్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్‌లో కూడా పోలీసులు ఆమెను అత్యాచారం చేసినట్లు తేలిందని సమాచారం. కానీ అన్నా తనకు 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని కేసు పెట్టింది. 
 
సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫోటోస్ చూస్తుంటే ఆమెకు పోర్న్ ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యాచారం జరిగిన రోజు అన్నాతో పాటు మరో ముగ్గురు మహిళలు అక్కడ ఉన్నారని.. వారిని పంపించేసిన పోలీసులు అన్నాను మాత్రమే తీసుకెళ్లారని అన్నా తరపు లాయర్లు వాదిస్తున్నారు. 
 
ఇకపోతే... 2008లో అన్నాపై అత్యాచారానికి పాల్పడిన ఇదే ఇద్దరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాజాగా అన్నాపై అత్యాచారం అభియోగాలు రుజువైతే వీరికి కఠిన శిక్ష తప్పదని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు.దీనిపై మరింత చదవండి :  
Girl Rape Handcuff Cops Marijuana Van New York Anna Chambers

Loading comments ...

తెలుగు వార్తలు

news

తితిదే ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఎందుకు..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లోని ...

news

కడుపునొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. కత్తెర పెట్టి కుట్టేశారు..

కడుపునొప్పి భరించలేక ఓ రోగి ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ పొట్టలో కత్తెర వుందనే విషయం ...

news

జాతీయ గీతాన్ని గౌరవించకపోతే.. మూడేళ్ల జైలు ఖాయం: చైనా

సినిమా థియేటర్లలో జాతీయ గీతం అంశంపై దేశవ్యాప్త చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. దీనిపై ...

news

నేడే 'రేవంత్ రెడ్డి' సినిమా విడుదల... ఢిల్లీలో 'రాహుల్ గాంధీ' రిలీజ్

రేవంత్ రెడ్డి సినిమా విడుదల ఏంటి అనుకుంటున్నారా.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ రేవంత్ ...