శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (13:55 IST)

మెక్సికో అమ్యూజ్‌మెంట్ పార్క్ రైడ్‌.. సీటు నుంచి జారిపడిన యువతి(video)

ఎముకల్లో చలిపుట్టించే.. గగుర్పాటు కలిగించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఏ మహిళ అమ్యూజ్‌మెంట్‌ పార్కులో రైడ్‌కు వెళ్లగా అక్కడ నుంచి కింద పడింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట భారీగా షేర్ అవుతోంది. ఈ ఘటన శుక్రవారం మెక్సికోలోని కాటప్లమ్ అమ్యూజ్‌మెంట్ పార్కులో చోటుచేసుకుంది. 
 
మెక్సికో మీడియా వివరాల ప్రకారం.. వీడియోలో యువతి రైడ్‌లో తన సీటు నుంచి జారిపడింది. రైడ్‌లో కూర్చుని ఊగుతుండగా.. ఓ మహిళ సీటు నుంచి జారి పడింది. కిందపడి తేరుకునేలోపే రైడర్ తగిలి దూరంగా పడింది. ఈ ఘటనలో ఆమె గాయాలకు గురించిన వివరాలు తెలియరాలేదు. ఇంకేముంది.. వైరల్ అవుతోన్న వీడియోను మీరూ ఓసారి వీక్షించండి.