బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (14:26 IST)

రోజుకు 30 మంది.. 43వేల మంది రేప్ చేశారు.. న్యాయవాదిగా మారాను

ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఓ గ్యాంగూ కాదు.. ఏకంగా 43వేల మంది మృగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన కార్లా జాసింటో.. గత ఏడాది అంతర్జాతీయ మీడ

ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఓ గ్యాంగూ కాదు.. ఏకంగా 43వేల మంది మృగాళ్ల చేతుల్లో నలిగిపోయిన ఓ యువతి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన కార్లా జాసింటో.. గత ఏడాది అంతర్జాతీయ మీడియా ముందుకొచ్చింది. 12 ఏళ్ల వయసులో మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లోకి చిక్కుకున్న ఈమె.. బలవంతంగా వేశ్యగా మార్చబడింది. డబ్బు మీద మోజుతో, తనను కలిసిన వ్యక్తితో బయటికి వెళ్లింది. 
 
అంతే అప్పటి నుంచి సెక్స్ బానిసగా మారిపోయానని వెల్లడించింది. రోజుకు 30మంది విటులను భరిస్తూ.. నాలుగేళ్ల  పాటు నరకయాతన అనుభవించానని జాసింటో తెలిపింది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా వచ్చేవి కావని.. పరిస్థితి అంత దారుణంగా వుండేదని చెప్పుకొచ్చింది.
 
ఉదయం పది గంటల నుంచి అర్థరాత్రి వరకూ తనపై మృగాళ్లు పడుతుంటే, బాధను తట్టుకోలేక ఏడుస్తూ, కళ్లు మూసుకునే దాన్ని.. అంతకుమించి ఏమీ చేయలేని స్థితిలో వుండేదాన్నని చెప్పుకొచ్చింది. పోలీసుల దాడులతో తిరిగి జనజీవనంలోకి వచ్చిన కార్లా ప్రస్తుతం ఓ మంచి న్యాయవాది. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోర్టులకు వచ్చే కేసులను వాదిస్తూ.. తనలాంటి అభాగ్యుల తరపున నిలుస్తోంది.