గురువారం, 26 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (11:53 IST)

కమలా హ్యారీస్ కార్యాలయంపై దుండగులు కాల్పులు

kamala haris
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ యేడాది ఆఖరులో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత మాజీ అధ్యక్షుడు కమలా హ్యారీస్‌లు పోటీ పడుతున్నారు. వీరద్దరూ తమతమ విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల ప్రచారంలో కొన్ని దుస్సంఘటనలు జరిగాయి. ఇటీవల డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. తాజాగా డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కార్యాలయంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 
 
అరిజోనాలోని ఆమె సమన్వయ ప్రచార కార్యాలయంపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కార్యాలయం కిటికీల నుంచి కాల్పులు జరిపినట్టు గుర్తించారు. అర్థరాత్రి కావడం, లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు కాల్పులు జరిగాయి. తొలిసారి పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా నిందితుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ కుడిచెవికి గాయమైంది. ఇటీవల మళ్లీ కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా హత్యాయత్నం జరిగింది.
 
ఫెన్సింగ్ వద్దకు తుపాకితో వచ్చిన నిందితుడిని భద్రతా బలగాలు కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. కాగా, నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు జోబైడెన్ బరిలో ఉండగా ముందంజలో ఉన్న ట్రంప్.. కమలా హారిస్ పోటీలోకి వచ్చాక మాత్రం వెనకబడిపోయారు.