సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (13:23 IST)

ఇండియన్ టెక్కీలకు ముచ్చెమటలు... అమెరికా సభకు హెచ్1 బీ వీసాల సంస్కరణ బిల్లు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన హెచ్1 బి వీసాల సంస్కరణల బిల్లును అమెరికా కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టారు.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన హెచ్1 బి వీసాల సంస్కరణల బిల్లును అమెరికా కాంగ్రెస్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఆమోద ముద్రవేస్తే అమెరికా పని చేసే విదేశీ టెక్కీలు పెను కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, అనేక భారతీయ కంపెనీలు తమ షట్టర్లు మూసుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడనుంది. 
 
భారత టెక్నాలజీ కంపెనీలు అత్యధికంగా వాడుతున్న హెచ్1 బీ వీసాలను గణనీయంగా తగ్గించడంతో పాటు, కఠిన నిబంధనలు విధిస్తూ, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తయారు చేశారు. దీనిపై ట్రంప్ సంతకం పెట్టనున్నారు. ఈ వార్త భారత టెక్కీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రతి యేటా అమెరికా 85 వేల హెచ్1 బీ వీసాలను ఇస్తుండగా, ఇందులో సింహభాగాన్ని అంటే, దాదాపు 80 శాతానికి పైగా వీసాలు భారత్‌కే దక్కుతున్నాయి. 
 
ప్రస్తుతం 60 వేల డాలర్ల వేతనం కలిగిన వారికి హెచ్1 బీ వీసాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ పరిమితిని ప్రస్తుతం కనిష్టంగా లక్షా 30 వేల డాలర్లకు పెంచారు. అంటే ఇంత మొత్తంలో వేతనం కలిగిన వారికి మాత్రమే ఈ వీసాలను జారీ చేస్తారు. వాస్తవానికి భారతీయ టెక్కీలంతా అతి తక్కువ వేతనానికి పని చేస్తున్న విషయం తెల్సిందే. అందువల్ల వీసా సంస్కరణల బిల్లుకు ఆమోదం తెలిపినట్టయితే ఆ ప్రభావం గరిష్టంగా భారత టెక్కీలపైనే చూపనుంది.