శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 మే 2017 (17:27 IST)

ఉన్ ఓ పిచ్చోడు.. ఉ.కొరియాపై అణు దాడి చేద్దాం.. అమెరికా - ద.కొరియా కసరత్తు

ఉత్తర కొరియా పనిబట్టేందుకు అమెరికా, దాని మిత్రదేశం దక్షిణ కొరియా సిద్ధమయ్యాయి. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా వరుసగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ, శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఉత్త

ఉత్తర కొరియా పనిబట్టేందుకు అమెరికా, దాని మిత్రదేశం దక్షిణ కొరియా సిద్ధమయ్యాయి. ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా వరుసగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ, శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ఈ రెండు దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. అవసరమైతే ఉ కొరియాపై అణు దాడి చేయాలని నిర్ణయించాయి. 
 
తమపై దుస్సాహసానికి ఒడిగడితే అమెరికానే భస్మీపటలం చేస్తామంటూ ఉకొరియా అధ్యక్షుడు బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాపై అణుబాంబు వేయడానికి అమెరికా, దక్షిణకొరియాలు కసరత్తు చేశాయని తెలుస్తోంది. ఉత్తరకొరియా నిన్న మరో క్షిపణి పరీక్షను నిర్వహించిన అనంతరం... అమెరికా, దక్షిణకొరియాలు సూపర్ సోనిక్ బీ-1బీ లాన్సర్ బాంబును పరీక్షించాయి. ఈ సంయుక్త చర్య ఆందోళనలను రేకెత్తిస్తోంది.