శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (06:56 IST)

60 సెం.మీ. మేరకు కుంగిన హిమగిరులు... ప్రళయం తప్పదా?

గత యేడాది నేపాల్ దేశంలో సంభవించిన భూకంపం ధాటికి హిమాలయా పర్వతాలు 60 సెంటీ మీటర్ల మేర కుంగిపోయాయని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. అయితే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం కుంగిపోయిన ప్రాంతానికి దూరంగా ఉండడంతో దానిపై ప్రభావం పడలేదన్నారు. 
 
2015 ఏప్రిల్‌లో నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా 60 సెం.మీలు కుంగినట్లు శాటిలైట్‌ టెక్నాలజీ ద్వారా గుర్తించినట్టు వారు వెల్లడించారు. ఈ పెను భూకంపం దాదాపు 8 వేల మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది నిరాశ్రయులైన విషయం తెల్సిందే. 
 
అయితే, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనకర్తలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్‌ శిఖరం భూకంపం సంభవించిన ప్రాంతానికి 50 కి.మీల దూరంలో ఉండడంతో దానిపై ప్రభావం పడలేదని అంటున్నారు.