మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 10 మే 2017 (12:45 IST)

పార్లమెంటులో పాపాయికి పాలిచ్చి రికార్డు సృష్టించిన మహిళా సెనేటర్

మహిళలు రికార్డులు సృష్టిస్తున్నారు. ఉద్యోగాల్లో ఉన్నతస్థాయిలోనూ, రాజకీయాల్లో అగ్రస్థానాల్లోనూ రాణిస్తూనే కన్నబిడ్డలకు ఏ లోటు లేకుండా ముందుకు తీసుకువెళ్లి వారి ఉన్నతికి అహరహం కృషి చేస్తున్నారు. ఈ విషయంలో పురుషులను వారు చాలామార్లు బీట్ చేస్తున్నారు. తా

మహిళలు రికార్డులు సృష్టిస్తున్నారు. ఉద్యోగాల్లో ఉన్నతస్థాయిలోనూ, రాజకీయాల్లో అగ్రస్థానాల్లోనూ రాణిస్తూనే కన్నబిడ్డలకు ఏ లోటు లేకుండా ముందుకు తీసుకువెళ్లి వారి ఉన్నతికి అహరహం కృషి చేస్తున్నారు. ఈ విషయంలో పురుషులను వారు చాలామార్లు బీట్ చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా పార్లమెంటులో ఓ మహిళా సెనేటర్ ఆస్ట్రేలియా చరిత్రలోనే ఓ రికార్డు సృష్టించింది. 
 
పార్లమెంటు జరుగుతుండగా తన రెండేండ్ల బిడ్డకు పాలిస్తూ లాలిస్తూ పార్లమెంటు ప్రసంగాలను విన్నది. ఆస్ట్రేలియా మహిళా సెనేటర్ పేరు లారిస్సా వాటర్స్ కాగా ఆమె బిడ్డ రెండు నెలల పాపాయి పేరు అలియా జాయ్. ప్రసూతి శెలవు ముగించుకుని బిడ్డతో పాటు పార్లమెంటుకు వచ్చింది సదరు మహిళా సెనేటర్. బిడ్డ పాల కోసం ఏడుస్తుండగా ఆ పాపాయికి పాలిచ్చిందా తల్లి. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కన్నబిడ్డను ఇంటి వద్దే వదిలేసి కొంతమంది ఏవో పోతపాలు పడుతుంటారనీ, కానీ ప్రతి మహిళ తమ బిడ్డకు ఏ విధి నిర్వహణలో వున్నా పాలివ్వాలని కోరింది. కాగా ఆస్ట్రేలియా పార్లమెంటు గత ఏడాది నిబంధనలను మార్చింది. ఈ నిబంధనల ప్రకారం పార్లమెంటులో కన్నతల్లి నెలల పాపాయికి పాలివ్వవచ్చు.