Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విమాన ప్రయాణీకుల గుండెల్లో దడ పుట్టించిన కిమ్.. ఖండాంతర క్షిపణి ప్రయోగంతో?

బుధవారం, 17 జనవరి 2018 (10:20 IST)

Widgets Magazine
north korea h-bomb

ఉత్తర కొరియా అణు క్షిపణుల ప్రయోగంతో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించింది. అయితే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హాంకాంగ్ వెళుతున్న విమానంలో ప్రయాణించిన ప్రయాణీకులను భయభ్రాంతులను చేసింది.
 
ఉత్తర కొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారికి కనిపించింది. దీంతో వారు జడుసుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు కూర్చున్నారు. ఈ ఘటన గత సంవత్సరం నవంబర్ 28న జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని.. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సేన్ విమర్శించారు. జపాన్ తీర ప్రాంతానికి 155 మైళ్ల దూరంలో విమానం ప్రయాణిస్తున్న వేళ ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. కిమ్ వైఖరి అన్ని దేశాల ప్రజలకూ నష్టదాయకమేనని అన్నారు.
 
వివరాల్లోకి వెళితే.. హాంకాంగ్ వెళ్తున్న విమానానికి కేవలం 280 నాటికల్ మైళ్ల దూరంలో ఈ క్షిపణి వుంది. ఆ దారిలో ఆ సమయానికి తొమ్మిది విమానాలు కూడా వెళ్తున్నాయి. ఆ రోజు మొత్తం మీద 716 విమానాలు ఆ క్షిపణి రేంజ్ లోనే ప్రయాణించాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సి వుందని అమెరికా డిమాండ్ చేస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డోనాల్డ్ ట్రంప్‌ రసికత... బయటకు పొక్కకుండా లంచం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టకముందు రాసలీలలు అన్నీఇన్నీకావు. ...

news

పిచ్చి పీక్స్‌కు.. ఇళ్ళు కాళుతుంటే భార్యాభర్తల సెల్ఫీ... ఎక్కడ..?

సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సెల్ఫీ ...

news

ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో ...

news

పెద్దనోట్ల రద్దు... 12 వేల ఎకరాలు కొన్న శశికళ?

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 వేల కోట్ల పన్ను ఎగవేతతో దేశంలోనే మొదటగా ఉన్నారు జైలు ...

Widgets Magazine