ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 జూన్ 2018 (09:26 IST)

చైనాలో క్యాబ్‌‍డ్రైవర్ల అత్యాచార పర్వం.. ఇక పురుషులు ఆ పని చెయ్యొద్దు..

మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలపై బీజింగ్‌లో ట్యాక్సీ డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో.. రాత్రి పది గంటల తర్వాత పురుష

మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలపై బీజింగ్‌లో ట్యాక్సీ డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో.. రాత్రి పది గంటల తర్వాత పురుష క్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణీకులను ఎక్కించుకోకూడదని.. చైనా ప్రకటించింది. 
 
రాత్రి పదికి పైన పురుషులైన క్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణీకులను ఎక్కించుకోవడంపై చైనా సర్కారు నిషేధం విధించింది. నగరంలోఇప్పటికే చాలినంతమంది మహిళా డ్రైవర్లు ఉన్నారని, ఇకపై వారే మహిళలను ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతారని చైనా ప్రభుత్వాధికారులు స్పష్టం చేశారు. 
 
అంతేగాకుండా అర్థరాత్రి నుంచి ఉదయం ఆరింటి వరకు క్యాబ్ సేవలుండవని, క్యాబ్ సర్వీసులు వుండవని చైనా వెల్లడించింది. క్యాబ్ డీడీని తాత్కాలికంగా రద్దు చేసిన సర్కారు ప్రస్తుతం దాని సర్వీసులను పరిమితం చేస్తూ.. సేమ్-సెక్స్ రూల్‌ పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
 
కాగా.. 21 ఏళ్ల మహిళపై 35 ఏళ్ల కారు డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. మరో ఘటనలో 22 ఏళ్ల యువతిని ఎక్కించుకున్న డ్రైవర్ ఆమె అత్యాచారానికి పాల్పడబోయాడు. అంతలో ఆమె తల్లిదండ్రులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పరారైన సంగతి తెలిసిందే.