Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీరు గట్టిగా పట్టుకోండి... నవ వధువుపై భర్త రేప్, చంపేసిందంతే...

శనివారం, 12 మే 2018 (17:44 IST)

Widgets Magazine

తనకు ఇష్టం లేకుండా లైంగిక సుఖం కోసం తనపై అత్యాచారం చేసినందుకు నవ వధువు తన భర్తను హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. దాంతో ఆ 19 ఏళ్ల యువతికి కోర్టు మరణ దండన విధించింది. ఈ ఘటన సూడాన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే... తనకు ఇష్టం లేకుండా యువతి తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఐతే గత ఏప్రిల్ నెలలో ఆమె తనకు వివాహం ఇష్టం లేదని పుట్టింటికి తిరిగొచ్చింది. కానీ, ఆ తర్వాత ఆమె భర్త వచ్చి తనను తీసుకుని వెళ్లాడు. శోభనం ఏర్పాట్లు చేశారు. ఆమె మాత్రం ససేమిరా అన్నది. దాంతో ఆమెను దారిలోకి తెచ్చుకునేందుకు ఆరు రోజుల పాటు ఆ యువకుడు ఎదురుచూశాడు. అయినప్పటికీ ఆమె తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. 
Rape
 
ఇక లాభం లేదనుకున్న యువకుడు తన బంధువులను పిలిచి విషయం చెప్పాడు. ఆమెను గట్టిగా పట్టుకోవాలని చెప్పి, వారలా ఆమెను పట్టుకున్న సమయంలో ఆమెను బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆమె తనకు ఇష్టం లేదని మొత్తుకుంటున్నా అతడు మాత్రం వదల్లేదు. మళ్లీ రెండో రోజు కూడా అలాగే చేసేందుకు బంధువులను పిలిచాడు. ఇంతలోనే ఆమె ఆగ్రహంతో భర్తపై దాడి చేసి హత్య చేసింది. ఈ పరిణామానికి అంతా షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టు విచారించింది. సూడాన్‌లో స్త్రీలు పురుషులకు ఎదురుతిరక్కూడదు. 
 
ఆమె భర్తను ఎదిరించడమే కాకుండా అతడిని హత్య చేసినందుకు మరణ దండన విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఐతే ఆమె తల్లిదండ్రులు తన బిడ్డకు ఇష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ తనను తను కాపాడుకునేందుకు ఇలా ప్రవర్తించిందనీ, ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా సూడాన్‌లో అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం, వారిని హింసించడం సర్వసాధారణం. దీనిపై అంతర్జాతీయంగా నిరసనలు వచ్చినా ఆ దేశం మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Husband Forcibly Rape Wife Murdered Teen Bride Death Penalty Sudan Court

Loading comments ...

తెలుగు వార్తలు

news

వామ్మో రాకాసి అల.. ఎనిమిదో అంతస్తు మేడను తాకింది..

న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో గల క్యాంప్‌బెల్ ద్వీప సమీపాన రాకాసి అలను ...

news

కర్ణాటక ఎన్నికల పోలింగ్: ఓటేసిన వధూవరులు, వృద్ధులు..

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. బెంగళూరులోని చాలా పోలింగ్ బూత్‌లలో ...

news

దాచేపల్లిలో మరో ఘోరం: 12 బాలికపై ఎంపీటీసీ భర్త రేప్.. 3 నెలల గర్భవతి..

దాచేపల్లి అకృత్యాలకు నిలయంగా మారిపోయింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్‌ బాలికపై ఓ ...

news

#KarnatakaVotesForCongress కాంగ్రెస్‌కు 120పైగా సీట్లు వస్తాయ్.. యడ్డీ పాపం: సిద్ధరామయ్య

ర్ణాటకలో మరోసారి కాంగ్రెస్‌దే విజయమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వరుణలో ఓటు హక్కును ...

Widgets Magazine