లాటరీ బంపర్ డ్రాతో వరించిన అదృష్టం.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి!
ఓ మహిళ కట్టుకున్న భర్తను మోసం చేసింది. భర్తకు తెలియకుండా మరో పెళ్లి చేసుకుంది. దీనికి కారణం ఆమె కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ బంపర్ బహుమతి రావడమే. ఈ విషయం తెలుసుకున్న భర్త నిర్ఘాంతపోయి తనకు న్యాయం చేయాలని కోర్టుకెక్కాడు. ఈ ఘట థాయ్‌లాండ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
48 యేళ్ల ఏళ్ల నారిన్‌కు థాయ్‌లాండ్ కరెన్సీలో 2 మిలియన్ల బహ్త్‌ల వరకు అప్పులున్నాయి. దీంతో వాటిని తీర్చేందుకు డబ్బు సంపాదన కోసం 2014లో దక్షిణ కొరియాకు వెళ్లడాు. అక్కడ పని చేస్తూ ప్రతి నెల 27 - 30 వేల బహ్త్‌లను థాయ్‌లాండ్‌లో పిల్లలో ఉన్న భార్య చవీవన్‌కు పంపించేవాడు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తన భార్యకు రూ.2.9 కోట్ల విలువైన లాటరీ బంపర్ బహుమతిని గెలుచుకున్నట్టు నారిన్‌కు తెలిసింది.
ఈ విషయం తనకు చెప్పకుండా దాచిపెట్టడంతో భార్యను నారిన్ అనుమానించాడు. ఫోన్లు చేస్తున్నా తీయకపోవడంతో ఈ నెల 3వ తేదీన స్వదేశానికి వచ్చాడు. అక్కడకు వచ్చిన తర్వాత భార్య చేసిన పనికి నిర్ఘాంతపోయాడు. గత నెల 25వ తేదీన ఆమె ఓ పోలీస్ అధికారిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.
20 యేళ్లపాటు తనతో కాపురం చేసిన భార్య ఇలాంటి పాడు పని చేస్తుందని ఊహించలేక పోయానని పేర్కొంటూ తనకు న్యాయం చేయాలంటూ ఆయన కోర్టుకెక్కాడు. అయితే, చవీవన్ వాదన మరోలా ఉంది. తనకు లాటరీ తగలడానికి చాలా ఏళ్ల క్రితమే నరీన్‌తో తెగదెంపులు చేసుకున్నట్టు పేర్కొంది. అయితే, అతడు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నాడు.