శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:25 IST)

బ్రిటన్‌కు భారత్ హెచ్చరిక

కోవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధనాలు రూపొందించింది.

అయితే భారత్‌లో తయారైన టీకాలను వినియోగించుకుంటున్న బ్రిటన్.. భారతీయులపై ఇలాంటి వివక్షాపూరిత విధానాలను మొపడం ఎంత మాత్రం సబబు కాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన క్వారంటైన్ విధానంపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది.

యూకే తన విధానాల్ని మార్చుకోకపోతే ప్రతిచర్య తప్పదని కూడా హెచ్చరించింది. సమస్య పరిష్కారానికి బ్రిటన్ నుంచి త్వరితగతిన హామీ రావాలని తాము కోరినట్లు, ఈ విషయమై తగిన హెచ్చరిక కూడా చేసినట్లు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.

విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కోవిడ్ నిబంధనల గురించి బ్రిటన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 4వ తేదీ నుంచి బ్రిటన్ వచ్చే భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకున్నప్పటికీ క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలంటూ నిబంధనలు జారీ చేసింది.