1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (10:44 IST)

ఎన్నారై జాక్ పాట్.. రూ. 33.99కోట్లు.. ఫోన్ తీయలేదు..

అబుదాబిలో ఉంటున్న ఒక ఎన్నారై జాక్ పాట్ కొట్టాడు. అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లాటరీలో ఏకంగా 15 మిలియన్ దిర్హమ్‌లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో ఇది అక్షరాలా రూ. 33.99 కోట్లు.
 
అయితే ఫోన్ తీయలేదు. దీంతో ఇతర మార్గాల్లో ప్రయత్నించి లాటరీ డబ్బును ఆయనకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆయన కొనుగోలు చేసిన 256 సిరీస్ 098801 నెంబర్ టికెట్‌కు లాటరీ తగిలింది.  
 
వివరాల్లోకి వెళితే.. ఖతార్‌లో ఉండే ముజీబ్ తెక్కే మట్టియేరి అనే భారతీయుడికి ఈ జాక్ పాట్ తగిలింది. సెప్టెంబర్ 27వ తేదీని లాటరీ టికెట్‌ను ఆయన ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. లాటరీ గెలిచిన విషయాన్ని ఆయనకు చెప్పేందుకు నిర్వాహకులు ఫోన్ చేయగా అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.