Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అబద్దాలు చెప్పి బతికేయడానికి ఇది ... కాదు.. అమెరికా.. పౌరసత్వమే పోతుంది జాగ్రత్త

హైదరాబాద్, శుక్రవారం, 14 జులై 2017 (11:12 IST)

Widgets Magazine

ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంత ఆచార్యులుగా భారత్-అమెరికా మధ్య తిరుగుతూ రచనా వ్యాసంగంలో ఉన్న ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారు నాలుగు రోజుల క్రితం అమెరికా నుంచి ఫోన్ చేశారు. కాస్సేపు సంభాషణ తర్వాత మీరు అమెరికాలో ఉన్న మీ పిల్లల వద్దకు పోయి వస్తుంటారు కదా అమెరికాలో మీరు ప్రత్యేకంగా గుర్తించిన, గమనించిన విశిష్టమైన అమరికన్ లక్షణం ఏమిటి అని అడిగాను. అమెరికన్ పాలకుల మాటేంటో కానీ సాధారణ అమెరికన్ ప్రజలు చట్టాన్ని గౌరవించే తీరు చాలా నచ్చింది అన్నారాయన. 
 
ఆయన అభిప్రాయం ప్రకారం.. చట్టం అంటే అమెరికన్లకు గాడ్. దేవుడన్నమాట. సాధారణ అమెరికన్ చట్టం ఇది చెయ్యి. ఇది చేయకూడదు అని చెప్పిందంటే ఖచ్చితంగా పాడిస్తాడు. ట్రాఫిక్  విషయంలో కాని మరే విషయంలో అయినా సరే మనలాగా ఉల్లంఘించాలని అనుకోరు. ఇది మనది మనకోసం అమలులోకి వచ్చింది అనే చైతన్యం వారిలో ఇంకిపోయి ఉంటుంది అదే మనకూ వారికీ తేడా అనేశారు. అలాగని అమెరికాలో నేరాలు జరగలేదని కాదు. చట్ట ఉల్లంఘనకు ఎవరూ పూనుకోలేదని కాదు. కాని చట్టాన్ని పాటించాలి అనే చైతన్యం అమెరికన్ లక్షణం అన్నారు దేవిరెడ్డి గారు.
 
మన విషయానికి వస్తే అమెరికాలో అబద్దం చెప్పి చివరకు తన పౌరసత్వాన్నే కోల్పోనున్న భారతీయుడు అమెరికన్ చట్టం ఎంత పటిష్టంగా అమలవుతుందో ససాక్ష్యంగా చూపుతున్నాడు. తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేరాన్ని తమకు చెప్పకుండా దాచడమే కాకుండా తప్పుడు మార్గంలో అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నించిన ఓ భారతీయ అమెరికన్‌ పౌరుడు అమెరికా పౌరసత్వాన్ని కోల్పోనున్నాడు. 
 
ప్రస్తుతం కేసు విచారణ తుది దశలో ఉన్నప్పటికీ అతడు అధికారులకు సహకరించని కారణంతో అతడిని పౌరసత్వాన్ని రద్దు చేసి బహిష్కరించనున్నారు. వివరాల్లోకి వెళితే.. గురుప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తి వాటర్‌టౌన్‌లో నివాసం ఉంటున్నాడు. అతడు ఈ మధ్యే ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
దానికి సంబంధించి అతడిని పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా సిరాకస్‌లోని ఫెడరల్‌ కోర్టు మూడు నెలల శిక్ష కూడా విధించింది. అదే సమయంలో అతడు తన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పౌరసత్వాన్ని ధ్రువీకరించే క్రమంలో భాగంగా యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ (యూఎస్‌సీఐఎస్‌) అధికారుల ముందు హాజరైన అతడు తాను చేసిన నేరాన్ని వారికి చెప్పలేదు. 
ఆయనకు పలుమార్లు అవకాశం ఇచ్చినా తనపై ఏ కేసు లేదని, ఏ తప్పు చేయలేదని, అరెస్టు కాలేదని అబద్ధం చెప్పాడు. కానీ, అతడు నేరం చేసినట్లు, అరెస్టయినట్లు ఆధారాలు తెప్పించుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అతడి తప్పును గుర్తించి పౌరసత్వాన్ని త్వరలో రద్దు చేయనున్నారు. అమెరికా పౌరసత్వం ఖరారు చేసే సమయంలో ఆ వ్యక్తి ఎలాంటి నేరానికి పాల్పడినా అది ఆమోదం పొందదు. 
 
మన దేశాన్ని, మన ప్రజల మానసిక చైతన్యాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు కానీ చట్టం విషయంలో మన వైఖరికి, అమెరికన్ల వైఖరికి ఉన్న తేడాను ఇది నిరూపణగా చెబుతోంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్ళి కూడా ఫిక్స్... బట్టలు తెచ్చుకుంటానని వరుడు?

అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను కూడా ఒప్పించారు. అయితే ముహూర్తం సమయానికి ...

news

పత్రికల కవరేజీపై మార్గదర్శకాలుండాలి.. బాధితుల పేర్లు బహిర్గతం చేస్తారా?

కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న సినీనటి లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి పత్రికల ...

news

పొట్టలో నొప్పిగా ఉంది చూడవా ప్లీజ్... ఆస్పత్రి కొచ్చి అడుక్కున్న వానరం

పల్లెనుంచి తప్పిపోయి వచ్చి అడవిలోకి వచ్చిన చిన్న పాపను అక్కున చేర్చుకుని తమలో ఒకటిగా ...

news

ఒళ్లొంచి పనిచేయడంలో తేడాలే ఊబకాయానికి అసలైన వనరు

అమెరికాలో సగటున ప్రజలు ప్రతిరోజూ 4,700 మెట్లు ఎక్కుతారట. మెక్సికోలో కూడా ప్రజలు సగటున ...

Widgets Magazine