గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (08:55 IST)

తుంటి ఎముక మార్పిడి చికిత్స వికటించి భారతీయ చెఫ్ మృతి

దుబాయ్‌లో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ వికటించి భారతీయ మహిళా చెఫ్ మృతిచెందారు. ఆమె పేరు బెట్టీ రీటా ఫెర్నాండెజ్. దుబాయ్‌లో చెఫ్‌గా పని చేస్తున్నారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 
 
కాగా, జన్మతహ తుంటి ఎముక సమస్యతో బాధపడుతూ వచ్చిన ఆమెకు.. దాన్ని మార్చాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ ఆపరేషన్ కోసం ఆమె దుబాయ్‌లో ఉండే అల్ జహ్రా ఆసుపత్రిలో ఈ నెల తొమ్మివ తేదీన అడ్మిట్ అయ్యారు. ఆపరేషన్ బాగానే జరిగింది కానీ తర్వాతి దశలో అది వికటించి ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, ఆపరేషన్‌ తర్వాత లోపం ఎక్కడ జరిగిందన్నదానిపై వైద్యులు ఆరా తీస్తున్నారు. 
 
ఈ మహిళకు తుంటి సమస్య జన్మత వచ్చిందే. పుట్టిన నాటి నుంచే ఎడమ తుంటి భాగం పక్కకు జరిగినట్లుగా ఉందని వెల్లడైంది. ముంబైకి చెందిన ఫెర్నాండెజ్ స్థానికంగా ఉండే బెట్టిస్ కేక్ స్టాల్‌ను స్వయంగా నిర్వహిస్తూ ప్రధాన కుక్‌గా ఉంటున్నారు. హిప్ మార్పిడితో సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని ఆమె ఆస్పత్రిలో చేరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ సమిహ్ తారాబిచి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. అయితే 2 గంటల పాటు జరిగిన ఆపరేషన్ వికటించడంతో ఆమె తట్టుకోలేని స్థితిలో శాశ్వతంగానే ఈ లోకానికి దూరమయ్యారు. జరిగిన ఘటనపై ఫెర్నాండెజ్ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబాయ్ ఆరోగ్య అధికారిక వ్యవస్థ స్పందించింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది.