రూ.6 వేలకు కింగ్ జాంగ్ నామ్ హత్య.. ఆట పట్టించడం కోసం చేసిందట..: ఇండోనేషియా మహిళ వెల్లడి
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్‌ను హత్య కేసులో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఈ హత్య కేసు ఆరు వేల రూపాయలకు అంటే 90 అమెరికా డాలర్ల కోసం హత్య చేసినట్టు ప్రాథమిక విచా
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్‌ను హత్య కేసులో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఈ హత్య కేసు ఆరు వేల రూపాయలకు అంటే 90 అమెరికా డాలర్ల కోసం హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అదీ కూడా ఓ వ్యక్తి ఇచ్చిన ఈ డబ్బుకు ఆశపడి ఓ మహిళ ఈ హత్య చేసినట్టు తేలింది.
నామ్ హత్య కేసుకు సంబంధించి ఇద్దరు మహిళలను మలేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఒకరు ఇండోనేసియాకు చెందిన సిటి ఐశ్యాహ్ అయితే మరొకరు వియత్నాంకు చెందిన మహిళ. వారిలో ఐశ్యాహ్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
నామ్‌పై వీఎక్స్ విషం చల్లడాన్ని తనకు టీవీ షోల్లో తరచూ చేసే ఆట పట్టించే కార్యక్రమమని చెప్పారని, అందుకు తనకు 90 డాలర్లు ఇచ్చారని ఆమె తెలిపింది. అయితే, తాను కస్టడీలో ఉన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పవద్దని కోరడం గమనార్హం.
అయితే, ఇదేమీ ఆట పట్టించే కార్యక్రమం కాదని, నామ్ హత్య కుట్ర గురించి వారికి తెలుసని, తెలిసే వీఎక్స్ ఆయనపై చల్లారని మలేసియా పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగానే విచారణ చేస్తున్నారు. అలాగే, ఆ ఇద్దరు మహిళలకు రక్షణగా నలుగురు పురుషులు వచ్చారని, ఈ ఘటన జరిగిన వెంటనే వారు మలేసియా నుంచి పరారయ్యారని భావిస్తున్నారు.