బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (07:57 IST)

డిసెంబరు 15 నుంచి షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసెస్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను వచ్చే నెల 15వ తేదీ నుంచి పునరుద్ధరించాలని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో 14 దేశాలకు విమాన సర్వీసులను పరిమిత సంఖ్యలో నడుపనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. 
 
డిసెంబరు 15వ తేదీ నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు లేఖ రాసింది. దీంతో ఈ సర్వీసుల పునఃప్రారంభంపై డీజీసీఏ నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అయితే, డిసెంబరు 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ.. తొలుత  కరోనా ముప్పు లేని దేశాలకు మాత్రమే నడుపనున్నారు. ఈ దేశాల జాబితాలో బ్రిటన్, సింగపూర్, చైనా, బ్రెజిల్, బంగ్లాదేశ్, మారిషెస్, జింబాబ్వే, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి.  తర్వాత దశల వారీగా ఇతర దేశాలకు నడిచే సర్వీసులను పునరుద్ధరించే వీలుంటుంది.