శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (12:42 IST)

ఆస్తి పోతే పర్లేదు.. ప్రాణాలు తిరిగిరావు.. ట్రంప్- ఫ్లోరిడా వైపు హరికేన్

అగ్రరాజ్యం అమెరికా వైపు హరికేన్ దూసుకొస్తుంది. కనివినీ ఎరుగని రీతిలో హరికేన్ ఇర్మా బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇర్మా ప్రభావంతో గంటకు 209 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్

అగ్రరాజ్యం అమెరికా వైపు హరికేన్ దూసుకొస్తుంది. కనివినీ ఎరుగని రీతిలో హరికేన్ ఇర్మా బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇర్మా ప్రభావంతో గంటకు 209 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ అధికారులు చెబుతున్నారు. 25 సెంటీమీటర్ల నుంచి 51 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. 
 
ఇప్పటికే మియామి తీర ప్రాంత ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారు కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఫ్లోరిడా గవర్నర్‌ రిక్‌ స్కాట్‌ సూచించారు. ఇప్పటికే దాదాపు 76వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 
 
ఫ్లోరిడాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం విధ్వంసకర తుఫాను ముంచుకొస్తోందని ట్రంప్‌ ట్విట్టర్‌లో ప్రజలను హెచ్చరించారు. ఆస్తి పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణాలు తిరిగిరావని.. ట్రంప్ అధికారులకు హితవు పలికారు. వీలైనంత త్వరగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా సూచించారు.