Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్టోబరు 15న భూమి అంతం... ముహూర్తం ఫిక్స్ అంటున్న డేవ్...

సోమవారం, 9 అక్టోబరు 2017 (12:18 IST)

Widgets Magazine
Sun Storm

మన సౌర కుటుంబంలో భూమి మీద ప్రాణికోటి వుందనేది మనకు తెలుసు. కానీ మన పొరుగునే వున్న మిగిలిన గ్రహాల పరిస్థితి ఏమిటా అని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అది పక్కనపెడితే.. ఈ భూమి వినాశనం అవుతుందంటూ గత కొన్నేళ్లుగా డూమ్స్ డే పేరిట రకరకాల సిద్ధాంతాలు చెప్పుకొచ్చారు. 
 
భూమి అంతం అంటూ కొన్ని తేదీలు కూడా ప్రకటించి దడ పుట్టించారు. కొత్తగా మరో తేదీని చెప్పి చమట్లు పట్టిస్తున్నారు. అదే ఈ నెల అక్టోబరు 15. ఈ తేదీన భూమి వినాశనం తప్పదని, ఈ రోజు నుంచి ఏడేళ్ల లోపు భూమి పూర్తిగా అంతమైపోతుందని డూమ్స్ డే సిద్ధాంతకారుడు డేవ్ మీడ్ చెపుతున్నారు. 
 
అది కూడా ప్లానెట్‌ ఎక్స్‌ లేదా నిబిరు గ్రహం మన భూమిని ఢీకొట్టడంతో భూ గ్రహం అతలాకుతలమవుతుందట. దానితో పాటు ప్రకృతి విపత్తులు... మెక్సికో భూకంపం, టెక్సాస్‌ వరదలు, కరీబియన్‌, ఫ్లోరిడాల్లో వచ్చిన హరికేన్ల వంటివి చుట్టిముట్టి మానవాళిని కబళిస్తుందని హెచ్చిరిస్తున్నాడు. గతంలో ఇలాంటి తేదీలను ఈయనగారు చాలానే చెప్పారు కానీ అవేవీ జరుగలేదు మరి. కొత్తగా చెప్పిన తేదీతో మళ్లీ కొంతమందికి గుబులు పుట్టిస్తున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నన్ను తిట్టాలని ఉంటే తిట్టండి... నేను పక్కనుంటాను... (Video)

హైదరాబాద్, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాసబ్ ట్యాంక్‌కు ...

news

సారీ ఆ ఒక్కటే ఉ.కొరియాపై బాగా పనిచేస్తుంది: యుద్ధం ఖాయమన్న ట్రంప్

అమెరికా-ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ...

news

హైదరాబాద్‌లో క్వార్టర్ మందేసి బండెక్కి డ్రైవ్ చేయొచ్చు? ఎందుకని?

హైదరాబాబాద్‌లో ఇకపై క్వార్టర్ బాటిల్ మందుకొట్టి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ...

news

"నన్నే అద్దె అడుగుతావే.." ఇంటి ఓనర్‌ను కొట్టిన తెరాస ఎమ్మెల్సీ

తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ తెరాసకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు తన జులుం ...

Widgets Magazine