శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (12:52 IST)

చైనీయులను గొంతుకోసి హత్య చేసిన ఐసిస్ ఉగ్రవాదులు... డ్రాగన్ కంట్రీ కన్నెర్ర

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను గొంతుకోసి హత్య చేయడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి పునరావృతమైతే భారీ మూల్యం చెల్లించుకోక

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై చైనా కన్నెర్రజేసింది. తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను గొంతుకోసి హత్య చేయడాన్ని డ్రాగన్ కంట్రీ జీర్ణించుకోలేక పోతోంది. ఇదే పరిస్థితి పునరావృతమైతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ చైనా విదేశాంగ శాఖ హెచ్చరించింది. 
 
గత నెలలో బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇద్దరు చైనా టీచర్లను ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. తాజాగా వారిని పాకిస్థాన్‌ గడ్డపై ఐసిస్ ఉగ్రవాదులు హతమార్చినట్టు అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
 
'ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు ఇద్దరు చైనీయులను చంపేశారు' అని అమాఖ్ పేర్కొంది. అయితే ఈ వార్త నిజమా? కాదా? అన్న విషయాన్ని అధికారులు తెలుసుకునే పనిలో ఉన్నట్టు బెలూచిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు.