మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మే 2020 (13:42 IST)

ఇక కరోనా పనిపడతాం : యాంటీబాడీ సిద్ధం.. ఇజ్రాయేల్ ప్రకటన

గత ఆర్నెల్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇక మూడినట్టేనని ఇజ్రాయేల్ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టినట్టు తెలిపింది. కరోనా వైరస్‌ను 4తమొందించే యాండీ బాడీని తమ దేశ పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగిందని ఇజ్రాయేల్ రక్షణ శాఖామంత్రి నెఫ్తాలీ బెన్నెట్ ప్రకటించారు. 
 
ఈ యాంటీబాడీ పేటెంట్ కోసం ఇజ్రాయెల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. తదుపరి దశలో వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ తయారీ సంస్థలను సంప్రదిస్తామని అన్నారు. తమ పరిశోధకులు ఈ ఘనతను సాధించడం గర్వకారణమంటూ బెన్నెట్ సంతోషం వ్యక్తం చేశారు.
 
ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. రోమ్‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీబాడీలను ఉత్పత్తిచేస్తున్నట్టు గుర్తించారు. ఇది మానవ కణాలపైనా సమర్థంగా పనిచేస్తుందని ఇటలీ పరిశోధకులు చెబుతున్నారు. 
 
నోవల్ కరోనా వైరస్‌ వ్యాక్సీన్‌కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో ఇదే అతిపెద్ద ముందడుగు అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో పేర్కొన్నారు. ఈ వేసవి తర్వాత మానవులపై పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
 
కాగా, కరోనా వైరస్ బారినపడిన అనేక దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్‌ను అంతమొందించేందుకు సరైన మందు లేకపోవడంతో వైరస్ రోజురోజుకూ వ్యాపిస్తోంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రపంచానికి ఓ శుభవార్త చెప్పిన విషయం తెల్సిందే. తాము కరోనాను అడ్డుకునేందుకు మోనోక్లోనాల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీని తయారు చేసినట్టు ప్రకటించింది. ఇది శరీరంలోకి వ్యాపించిన వైరస్ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేస్తుందని తెలిపిది. 
 
ఇజ్రాయేల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇజ్రాయేల్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) కలిసి ఈ శుభవార్తను వెల్లడించాయి. కరోనా వైరస్ బారినపడి రోగుల శరీరంలోకి ఈ యాంటీబాడీస్‌ను పంపించినట్టయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకుని నియంత్రిస్తుందని తెలిపాయి. ఇది ప్రయోగపూర్వకంగా నిరూపణ అయినట్టు పేర్కొన్నాయి. ఇపుడు ఇతర ఫార్మా కంపెనీలు ముందుకు వచ్చి ఈ యాంటీబాడీస్‌ను తయారు చేయాలని ఐఐబీఆర్ కోరాయి. 
 
కాగా, ఐఐబీఆర్ పరిశోధన శాలలను రెండు రోజుల క్రితం బెన్నెట్ పరిశీలించిన విషయాన్ని తెలియజేస్తూ ఇజ్రాయెట్ పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. వైరస్‌పై దాడి చేసే యాంటీబాడినీ బెన్నెట్ పరిశీలించారని తెలిపింది. ఐఐబీఆర్ సంస్థ పీఎంఓ పర్యవేక్షణలో పని చేస్తుంది. గత ఫిబ్రవరిలో జపాన్, ఇటలీ, ఇతర దేశాల నుంచి వైరస్ శాంపిళ్ళను ఇజ్రాయేల్‌కు తెప్పించారు. మైనస్ 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆ శాంపిల్స్ భద్రపరిచారు. అప్పటి నుంచి వ్యాక్సిన్ అభివృద్ధికి నిపుణుల బృందం కృషి చేస్తోంది.