శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (10:11 IST)

నల్లజాతీయులను ఎలా టార్గెట్‌ చేశారో స్పష్టమైంది: ఫ్లాయిడ్‌ బంధువు

అమెరికాలో నల్లజాతీయులను పోలీసులు ఏవిధంగా టార్గెట్‌ చేశారన్న విషయం జార్జి హత్యతో మరోసారి వెల్లడైందని, కేవలం చర్మం రంగు అధారంగా ఈవిధమైన హింసాకాండ సాగుతుందని పోలీసుల చేతిలో బలైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్యపై ఆయన సమీప బంధువు జార్జి ఫ్లాయిడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఆర్‌టి మీడియా సంస్థతో ఆయన గెట్టీస్‌బర్గ్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతూ.. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి దెరేక్‌ చావిన్‌ తన మేనల్లుడైన జార్జి హత్య సందర్భంగా తానేదో ఒక పెద్ద జంతువును వేటాడి చంపినట్లు ఫోజ్‌ ఇచ్చారని అన్నారు.

అత్యంత కిరాతకంగా జరిగిన ఈ ఘటన భవిష్యత్తులో అమెరికాలో మార్పులకు నాంది పలకాని ఆకాంక్షించారు. ఇదే సమయంలో జార్జి హత్యకు వ్యతిరేకంగా పలు నగరాల్లో ఆందోళనలు చేస్తున్న ప్రజలు హింసకు దూరంగా ఉండాలని కోరారు.

ఫ్లాయిడ్‌ మెడపై పలు నిమిషాల పాటు కాలుపెట్టి హత్య చేసిన దెరేక్‌లో తాను పాల్పడిన దురాగతంపై ఏమాత్రం పశ్చాతాపం కనపడుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.

కేవలం చర్మం రంగు అధారంగా ఈవిధమైన హింసాకాండ సాగుతుందని జోన్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ' పోలీసులు ఏం చెప్పారో జార్జి చేశారు. కానీ ఫలితం ఏంటో మీకు తెలుసు. అతను చనిపోయాడు.. కాదు చంపబడ్డాడు' అని పేర్కొన్నారు.