శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మే 2020 (13:54 IST)

వైట్ హౌస్‌కు చేరిన కరోనా వైరస్.. ఇవాంక పీఏకు కోవిడ్

కరోనా వైరస్ వైట్ హౌస్‌కు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పీఏకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేయించుకున్న ఇవాంక ట్రంప్, ఆమె భర్త జారేద్ కుష్నర్‌లకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. యూఎస్‌లో ఇప్పటికీ 76వేల మృతులు నమోదైనట్లు సమాచారం. 
 
అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కోవిడ్-19 పాజిటివ్‌గా కన్ఫార్మ్ అయిన తర్వాత ఇవాంక ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్‌కు టెస్టులు నిర్వహించారు. కొద్దిరోజుల ముందు ట్రంప్‌కు సన్నిహితంగా పనిచేసే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
 
వైట్ హౌజ్ మెడికల్ యూనిట్ కు సమాచారం అందించి.. వైట్ హౌజ్ క్యాంపస్ లో పనిచేసే యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినట్లు తెలిపాం. అని వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ హోగన్ గిడ్లే వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా ట్రంప్ స్టాఫ్ అందరికీ కరోనా టెస్టుులు నిర్వహిస్తున్నారు.